![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -839 లో... రాజ్ మనసులో ఏముందో, అసలు బిడ్డని ఎందుకు వద్దనుకుంటున్నాడో కనుక్కుందామని ఇందిరాదేవితో కావ్య అంటుంది. అప్పుడే రాజ్ వస్తాడు. ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటాడు. ఆయనకి ఏమైంది.. ఈ ఫోటోస్ చూసి కోప్పడుతాడనుకున్న, రెచ్చగొట్టి అసలు విషయం ఏంటో కనుక్కుందామనుకున్న.. కానీ సైలెంట్ గా ఉన్నారు. వేరే రూట్ లో ప్రయత్నం చెయ్యాలని కావ్య అనుకుంటుంది.
ఆ తర్వాత పనిమనిషి కావ్య కోసం జ్యూస్ చేస్తుంటే.. రాజ్ వచ్చి నేను చేస్తానని చేస్తాడు. రాజ్ జ్యూస్ చేసి అందులో అబార్షన్ టాబ్లెట్స్ కలుపుతాడు. ఆ జ్యూస్ కావ్య దగ్గరికి వెళ్లి ఇస్తాడు. నా కడుపులో ఉన్న బిడ్డ వద్దట కానీ, నా కోసం జ్యూస్ తీసుకొని వచ్చాడని కావ్య అంటుంది. మరొకవైపు అన్నయ్య చేస్తుంది తప్పు అని కళ్యాణ్ అనుకుంటాడు. కావ్య జ్యూస్ తాగుకుండా ఆపడానికి కళ్యాణ్ వస్తాడు. ఆ లోపే కావ్య జ్యూస్ తాగుతుంది.
ఆ తర్వాత రాజ్ ని కళ్యాణ్ పక్కకి తీసుకొని వెళ్లి ఎందుకు అన్నయ్య క్రూరంగా బిహేవ్ చేస్తున్నావని అనగానే.. లేదురా చివరి నిమిషంలో అబార్షన్ కోసం ట్యాబ్లెట్ కలిపిన జ్యూస్ ఇవ్వలేదని రాజ్ అంటాడు. రాజ్ జ్యూస్ మార్చి తీసుకొని వెళ్ళింది గుర్తు చేసుకుంటాడు. మంచి పని చేసావని రాజ్ ని కళ్యాణ్ హగ్ చేసుకుంటాడు.
తరువాయి భాగంలో కిచెన్ దగ్గర రాజ్ జ్యూస్ మార్చడం కావ్య చూస్తుంది. ఆ జ్యూస్ ని టెస్ట్ కోసం పంపిస్తుంది. ఆ జ్యూస్ లో అబార్షన్ టాబ్లెట్ కలిపారని డాక్టర్ చెప్తాడు. నా బిడ్డ వద్దనుకున్నప్పుడు ఆ జ్యూస్ ఎందుకు ఇవ్వలేదని కావ్య అనుకుంటుంది. అసలు ఎందుకు ఇలా అంటున్నాడో డాక్టర్ కి తెలిసే ఛాన్స్ ఉందని కావ్య అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |